"నా ఆలోచనలు"

------"బిజీ లైఫ్"------
-----------------------
బిజీ... బిజీ... లైఫ్
కాలం తో పోటీ పడుతుంది
ఫాస్ట్ ట్రైన్స్ వేగానికి అందదు
రద్దీ బస్సులతోకుస్తీ పడుతుంది
ఆఫీస్ లకి, కాలేజ్ లకి, స్కూళ్ళకు పొద్దున్నే పరిగెడుతుంది
ఈ రన్నింగ్ రేస్ లో పొరపాటున పడ్డావో
అంతే..!!
నిన్ను లేపడానికి చేయి అందించేవాడు ఒక్కడుండడు
కాదు....
కనీసం చూసే వాడుండడు ఈ జనారణ్యంలో...
నువ్వు ఓడిపోయినట్లే మై ఫ్రెండ్..... బీ కేర్ ఫుల్..!!
---------------------------------------------------------------------


------"నాయకుడు"------
-----------------------
నాయకుడంటే
జనం లోంచి రావాలి
జనం బాధలలోంచి రావాలి
జనం కన్నీళ్ళలోంచి రావాలి
కానీ...
వెన్నుపోట్లతో కాదు
డబ్బులోంచి కాదు
రాజకీయ వారసత్వంలోంచి కాదు
చెంచాగిరితో కాదు
అందచందాలను ఎరవేసి అంతకన్నా కాదు..!!
-------------------------------------------------------



------"పొరుగు దేశం"------
------------------------
క్రుతఘ్నత లేదు నీకు
సోదరత్వానికి అర్థం తెలియదు నీకు
కుటిలత్వానికి నిదర్శనం నీవు
నమ్మక ద్రోహానికి మారు పేరు నీవు
నయవంచనకు నిలువెత్తు రూపమ్ నీవు
మతోన్మాదానికి బానిసవు నీవు
రక్తం రుచి మరిగిన మౄగానివి నీవు
ప్రాణాలతో ఆడుకునే పిశాచివి నీవు
ఎదగడమంటే అసూయ నీకు
నాశనం చేయడం అంటే ఇష్టం నీకు
యుద్ధం అంటే ఆట నీకు
వెర్రెక్కి మతి భ్రమించిన ఓ దౌర్భాగ్యపు దేశమా!!
------------------------------------------------------


------"దేవుడు"------
--------------------------
నువ్వు ఎక్కడుంటావో తెలియదు
ఎలా ఉంటావో తెలియదు
చూసిన వాళ్ళు లేరు
చెప్పిన వాళ్ళు లేరు
కానీ చిత్రమేమిటంటే
అనంత కోటి రూపాలు నీకు!!
ఇంత కన్నా విచిత్రం ఎక్కడుంటుంది "దేవుడు" గారూ!!!
-------------------------------------------------------


------"భూమి"------
--------------------------
ఒక చిన్న గది
పది మందికి మాత్రమే సరిపోతుంది
వంద మందితో నింపితే ఏమవుతుంది?

ఒక ప్లేట్ లో అన్నం
సరిపుచ్చుకుంటే ఓ నలుగురికి సరిపోతుంది
మరి నలభై మంది తినడానికి ప్రయత్నిస్తే?

ఒక సీసా నీళ్ళు
పది మంది వరకు తాగొచ్చు
యాభై మంది దాహంతో అల్లాడుతుంటే?

ఒక పెద్ద హాలు
అందులో సగం మంది వరకు పొగ రాయుళ్ళు
ఆపకుండా పొగ వదులుతున్నారు పాత రైలింజనులా!
అక్కడున్నవారందరు ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి అవుతుంటే?

ఒక పెద్ద అడవి, ఎటు చూసినా పెద్ద పెద్ద చెట్లతో
ఎవడి పనికి వాడు నరుక్కుంటూ పోతే
నిల్చోవడానికి కూడా నీడ లేకుండా చేస్తే?

ఏమిటి పరిస్థితి??
అని రోదిస్తుంది భూమి మౌనంగా!!

"Color Of Money" - A Short Story












"LACK OF MONEY IS THE ROOT OF ALL EVIL."____ George Bernard Shaw

హైదరాబాద్ ఒక మహనగరం. పది, పదిహేను సంవత్సరాలలో చాలా మారిపోయింది. ఒక పాత పాటని మోడ్రన్ గా రీమిక్స్ చేసినట్టు, పదహరణాల తెలుగమ్మాయికి టీ_షర్ట్, జీన్స్ వేసినట్టుగా.మల్టిఫ్లెక్స్ థియేటర్స్, షాపింగ్ కాంప్లెక్స్ లు, ఐ_మాక్స్ థియెటర్, పబ్ కల్చర్ ఒకటేమిటి ఎంటర్ టైన్మెంట్ కి కావాల్సిన ప్రతి ఒకటి ఉంది.
మహేశ్ బాబు సినిమాలో డైలాగ్ ఉంటుంది..." హైదరాబాద్ చాలా డెవెలప్ అయింది, ఏది కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది" అని.అంతగా డెవలప్ అయింది మరి.

ఒక్కసారిగా ఇంతలా మార్పు రావడానికి మెయిన్ రీజన్ ఒక్కటే..... ఐ.టి ఇండస్ట్రీ రావడం వల్ల యూత్ కి జాబ్స్ పెరగడం...వేలల్లో జీతాలు, విందు వినొదాలకి భారీగా ఖర్చు చేయడం...కాలేజ్ స్టడీస్ పూర్తవగానే పెద్ద కంపెనీల్లో జాబ్స్, భారీగా జీతాలు.... ఒక్కసారిగా ఇండివిడ్యుయాలిటి రావడం యూత్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
దీనికి తోడు లోన్స్ అంటూ బ్యాంక్స్ ... మొబైల్ ఫోన్ దగ్గర్నుండి సొంత ఫ్లాట్ వరకు ఏది కావాలన్నా క్షణాల్లో ముందుంటుంది.

రఘు, విజయ్, రాజీవ్ హైదరాబాద్ లోని ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపనీలో ఉద్యోగులు...
అడ్డు అదుపు లేని ఇండివిడ్యుయాలిటీని ఎంజాయ్ చేస్తుండెవాళ్ళు.
రోజంతా పని చేయడం, రాత్రి కాగానే ఏ పబ్ కో, రెస్టారెంట్ కో వెళ్ళడం, ఫుల్ గా ఎంజాయ్ చెయడం.. ఇది వాళ్ళ దినచర్య.

ముందుగా రఘు గురించి చెప్పుకోవాలంటే , రఘుకి ముక్కు మీద కొపం. ముందు యాక్షన్ తర్వాతే డిస్కషన్ అన్నట్టు ఉంటుంది.
ఇక రాజీవ్ కి దేవుడి ఆశీస్సులు ఎక్కువ, ఎందుకంటే పుట్టడమే గుండెలో రంధ్రంతో పుట్టాడు. లక్కీ ఫెల్లో!!
విజయ్ కి ఇలాంటివి ఏవి లేవు కానీ, "టీ్" చేయడం లో expert. అతను పెట్టే "టీ" అంటే రఘు, రాజీవ్ కి చాలా ఇష్టం. ఏ కొంచం మూడ్ ఆఫ్ ఉన్నా విజయ్ పెట్టిన "టీ" తాగాల్సిందే.

జనవరి, 09,2009..
ఇండియాలోనే సంచలనం, అతిపెద్ద కుంభకోణం...ఇండియాలో టాప్5 లో ఉన్న ఒక సాఫ్ట్ వేర్ కంపనీ మోసానికి పాల్పడింది.ఆ కంపనీ ఎం.డి. చాలా పేరున్న వ్యక్తి.
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఎక్కడ చూసినా ఇక ఆ కంపనీ పని అయిపోయినట్టే అని పుకార్లు. ఆ కంపనీ ఉద్యోగుల్లో ఆందోలనతో కూడిన ఉత్కంట.
కంపనీ మూసెస్తే తమ పరిస్థితి ఏంటి?

రఘు, విజయ్, రాజీవ్ ముగ్గురూ ఆలోచిస్తున్నారు, తమ కంపనీ చేసిన స్కాం గురించి....

రాజీవ్:: ......... "వీడికి కావాల్సినంత డబ్బు, పలుకుబడి ఉంది... ఇంకా ఈ స్కామ్ లు చేయాల్సిన అవసరం ఏంటి..."
విజయ్:......... "పలుకుబడి ఉండాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే....."
రఘు:........... "ఇలాంటి స్కాం లు చేయాలి!!!!"
విజయ్:............" exactly" !! డబ్బు కావాలంటే ఏమైనా చేయాలి...మనీ పవర్ అలాంటిది!!!"

సార్ కొరియర్!!!!
బయట ఎవరో అరిచారు... విజయ్ డోర్ తీశాడు...
వచ్చిన వ్యక్తి కొరియర్ అబ్బాయి....
సార్ ఇక్కడ విజయ్ అంటే..........
ఆ నేనే అన్నాడు విజయ్.... అవతలి వ్యక్తి అడిగే లోపే....
సార్ మీకు కొరియర్ వచ్చింది...ఇక్కడ ఒక సంతకం పెట్టండి అన్నాడు...
విజయ్ సంతకం పెట్టి కొరియర్ తీసుకుని లోపలికి వచ్చాడు....

రఘు:..........కొరియరా ఎక్కడి నుండి....కొంపదీసి డబ్బులు కావు కదా!!!
విజయ్:.......... "అంత సీన్ లేదు మామ... బ్యాంక్ నుండి...credit card బిల్లు పే చేయమని..ఇప్పుడు ఎలా?.....
రాజీవ్:.......... ఈ మంత్ శాలరీ వచ్చాక పే చేద్దాంలే..దానికంత వర్రీ అవడం అవసరమా?
విజయ్:... మన ఎం.డి స్కాం లో ఇరుక్కున్నాడు, కంపనీ ఏ టైం లో క్లోజ్ చేస్తారో తెలియదు..ఇంక శాలరీలా!! నీకు "ఆశాజీవి ఆఫ్ ది ఇయర్" అవార్డ్ ఇవ్వొచ్చు రా!....
రఘు:...... సరే చూద్దాంలే, ఇప్పుడే ఇంకా ఏమ్ డిసైడ్ అవ్వలేం..రేపు ఆఫీస్ కి వెల్తే కానీ పరిస్తితి ఏంటో తెలియదు.....

మర్నాడు ఉదయం రఘు, విజయ్, రాజీవ్ ఆఫీస్ కి వెళ్ళారు...
ఆఫీస్ బయట పొలీస్ బందోబస్తు ఉంది. మెయిన్ గేట్ దగ్గరే అందర్ని ఆపేస్తున్నారు, గేట్ దాటి ఎవర్నీ లోపలికి రానివ్వట్లేదు..
ఉద్యోగులు ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ఉన్నారు..
అందరిలో ఒకటే ఫీలింగ్, మన ఎం.డి మోసగాడు కాదు, కంపనీ కి ఏమీ అవదు అని...

ఎవరికి వారు ఇలా అనుకుంటూ ఉండగా, లొపలి నుండి ఒక వ్యక్తి ని పోలీసులు చుట్టూ నిలబడి బయటికి తీసుకొస్తున్నారు.
అతన్ని చూడగానే అందరూ సైలెంట్ ఆయిపోయారు....

ఆ వ్యక్తి, ఆ కంపనీ ఎం.డి. నరసింహరాజు... ది గ్రేట్ నరసింహ రాజు అని మీడియా ఇన్ని రొజులు పొగిడిన వ్యక్తి...అక్కడ ఉన్న ఉద్యోగులు తాము చూస్తున్నది కలా, నిజమా అనుకుంటున్నారు... ఈ వ్యక్తినా ఇన్ని రోజులు దెవుడిలా చూసింది అనుకుంటున్నారు...మీడియా కెమెరాలు ఆగకుండా వాటి పని అవి చేస్తున్నాయి...రిపోర్టర్స్ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు ఒకరి తో ఒకరు పోటీ పడుతూ....

బయట నిల్చుని ఉన్న పోలీసులు జనాలని, మీడియాని వెనక్కి నెడ్తున్నారు, అతి కష్టంమీద నరసింహరాజుని తీసుకువచ్చి పొలీస్ వ్యాన్ లో కూర్చోబెట్టారు...
వెంటనే పొలీస్ వ్యాన్ అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది...సంవత్సరాల పాటు రబ్బరులా సాగే "విచారణ" కోసం !!

గేట్ బయట నిల్చుని ఉన్న ఉద్యోగులు కంపనీ పరిస్థితి గురించి స్పశ్టమైన ప్రకటన కావాలని డిమాండ్ చేస్తున్నారు...

ఇంతలో రాజీవ్ అక్కడికక్కడే కుప్పకూలి పొయాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రఘు, విజయ్ దగ్గర్లోని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళారు...

తొందరగాతీసుకొచ్చారు లేకుంటే చాలా సీరియస్ అయ్యుండేది అన్నాడు డాక్టర్, బయట వెయిట్ చేస్తున్న రఘు, విజయ్ తో..

డాక్టర్:......... కానీ ఒక్క విషయం మీతో చెప్పాలి
రఘు, విజయ్ చెప్పండి అన్నారు అనుమానంగా...
డాక్టర్:............ రాజీవ్ పేరెంట్స్ కాని బంధువులు కాని ఎవరైనా ఉన్నారా?
రఘు:............ ఉన్నారు కానీ, ఊర్లో ఉన్నారు డాక్టర్.. ఫరవాలేదు, మాతో చెప్పండి..
డాక్టర్:............. రాజీవ్ కండీషన్ బాగా లేదు..అతని గుండెలో రంద్రం ఉండటం వల్ల ఎప్పటికైనా ప్రమాదమే..దాన్ని పూర్తిగా cure చేయలేం కానీ, medicines తో కొంత వరకు control చేయొచ్చు. అన్నింటికన్నా, అతనికి షాక్ కలిగించే విషయాలు చెప్పకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి... ఇంకో సారి attack వస్తే అది అతనికి చాలా ప్రమాదం.
నేను medicines, treatment details ఇస్తాను, అవి కొంచం costly, కానీ ఇప్పుడు compulsory గా వాడాలి...

next day రఘు, విజయ్ హాస్పిటల్ నుండి రాజీవ్ ని తీసుకొని వస్తారు.

బాల్కనీ లో ఒంటరిగా కూర్చున్న రాజీవ్ ఆలోచనలో పడతాడు...medicines, treatment అయ్యే ఖర్చు ఎలా అని ......
బయటి నుండి వచ్చిన రఘు TV ఆన్ చేస్తాడు..
TV లో న్యూస్.. " స్కాం లో పట్టుబడ్డ నరసింహ రాజు ఒక దాని తర్వాత ఒకటిగా తను చేసిన మోసాలని ఒప్పుకుంటున్నాడు, తను ఏ రకంగా స్కాం చేసింది, ఎన్ని వేల కోట్లు దొంగ లెక్కలు చూపించింది, అన్నీ స్వయంగా ఒప్పుకుంటున్నాడు...
ప్రస్తుతం నరసింహ రాజు ని చంచల్ గూడ జైలుకి తరలిస్తున్నారు...
ఇదిలా ఉంటే, మరి కంపనీ పరిస్థితి ఏంటి అన్నది, అందరిలో ఆందోళన కల్గించే విషయం... దేశంలో ని ప్రముఖ కంపనీలు కొన్ని takeover చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.. కానీ అది ఏంతవరకు సాద్యం అన్నది ఇంకా తెలియరాలేదు."

ఆ రోజు సాయంత్రం ఏ చానల్ లో చూసినా నరసింహ రాజు మోసాలపై, కంపనీ ఏమవుతుంది అనే విషయంపై చర్చ...

next day morning ఒక పిడుగు లాంటి వార్త... నరసింహ రాజు కంపనీని ఏ కంపనీ take over చేయట్లేదు, కంపనీ చాలా నష్టాల్లో కూరుకు పోయింది, కంపనీని మూసేయడం తప్ప వేరే దారి లేదు అని management ప్రకటించింది.

రఘు, విజయ్, రాజీవ్ ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు.
రాజీవ్: ....... ఈ కంపనీ కాకపోతే ఇంకా చాలా కంపనీలు ఉన్నాయి, మనకున్న experience కి తప్పకుండా వేరే కంపనీ లో జాబ్ వస్తుంది.
రఘు:....... ఆ పని తొందరగా చేద్దాం... జేబులో డబ్బులు లేకుండా ఉండటమా.... ఆలొచిస్తేనే భయంకరం గా ఉంది...వీకెండ్ పార్టీలు, మందు లేదంటే పిచ్చెక్కి పోతుంది...
విజయ్:........ ది గ్రేట్ నరసింహ రాజు వల్ల మూడ్ ఆఫ్ అయింది...వెంటనే ఏదైనా పబ్ కి వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రా!! లేదంటె ఇవ్వాళ నిద్ర పట్టేట్టుగా లేదు..

రఘు, విజయ్,రాజవ్ ముగ్గురూ పబ్ కి వెళ్ళి బాగా తాగుతారు, ఒళ్ళు తెలియని స్థితి లో అర్దరాత్రి రూమ్ కి వస్తారు...

next day రాజీవ్, వేరే కంపనీల్లో జాబ్ చేస్తున్న తన ఫ్రెండ్స్ కి ఫొన్ చేస్తాడు, జాబ్స్ కోసం...
అందరి దగ్గర్నుండి ఒక్కటే ఆన్సర్.... "ప్రస్తుతం RECESSION ఉండటం వల్ల జాబ్స్ లేవు, ప్రాజెక్ట్స్ లేకపోవడం వల్ల ఉన్న employesని కూడ తీసేస్తున్నారు అని"

విజయ్, రాజీవ్ కూడా తమ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తారు, వాళ్ళు కూడా ఇదే చెప్తారు, recession వల్ల జాబ్స్ కి కష్టం గా ఉంది అని....

విజయ్ కి బ్యాంక్ నుండి కాల్ వస్తుంది....credit card బిల్లు పే చేయమని, లేకుంటే recovery agents వచ్చి డీల్ చేస్తారు అని చెప్తారు..
రఘు నెల క్రిందట ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బైక్ ని ఫైనాన్స్ వాళ్ళు వచ్చి లాక్కెళతారు..
రాజీవ్ కి రోజు, రోజు కి కష్టం అవుతుంది treatment, medicines ఖర్చు భరించలేక....

విజయ్ తీవ్రంగా ఆలోచిస్తుంటాడు.... ఈ ప్రాబ్లెమ్స్ అన్నింటికి ఒకటె సొల్యుషన్.... "MONEY"... యస్ money కావాలి....

to be continued......